అల్లు అర్జున్ ను ఉద్దేశించి చిరంజీవి ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అతని మేనమామ, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అభినందించారు. అల్లు అర్జున్ నటుడిగా 20 సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్ చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
డియర్ బన్నీ అని సంభోదించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, అతని చిన్ననాటి రోజులన్నీ తన మదిలో అలాగే ఉన్నాయని చెప్పారు. సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతోందని, సాధారణ నటుడిగా అడుగుపెట్టి ఐకాన్ స్టార్ గా ఎదగడం చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలతోపాటు ప్రేక్షకుల మన్నన కూడా అందుకోవాలని ఆశిస్తున్నట్లు ఆ ట్వీట్ లో చిరంజీవి అన్నారు.
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'విజేత', 'డాడీ' సినిమాల్లో అల్లు అర్జున్ బాలనటుడిగా కనిపించారు. 'గంగోత్రి' సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరించే కథల్లో నటించారు. స్టైలిష్ స్టార్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2021లో విడుదలైన 'పుష్ప' సినిమాతో బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎదిగాడు. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రీకరణలో ఉన్నారు.

రెండురోజుల క్రితం కథానాయకుడు రామ్ చరణ్ ఇచ్చిన పుట్టినరోజు పార్టీకి అల్లు అర్జున్ హాజరవలేదు. మెగా కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య పైకి తెలియని వివాదమేదో నడుస్తోందని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగువారితోపాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా ట్విటర్ లో విషెస్ చెప్పారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కనీసం చిన్న ఫొటో కూడా పెట్టకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications