హైదరాబాద్ కు సీఎం జగన్ : రాత్రికి నెల్లూరు గౌతమ్ భౌతిక కాయం : అమెరికాలో కుమారుడు..!!
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో సీఎం జగన్ ఆవేదన చెందారు. సహచర మంత్రి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన కాసేపట్లో హైదరాబాద్ కు చేరకోనున్నారు. నేటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అపోలోకు రానున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి మరణం పట్ల చంద్రబాబు..లోకేష్ సంతాపం ప్రకటించారు. నెల్లూరు జిల్లా నేత సోమిరెడ్డి ఆపోలోకు వచ్చారు. గౌతమ్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఒక మ్యారేజీ నిశ్చితార్ధం లో కలిసారని..చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి తెల్లారేసరికి ఇలా మరణించారనే వార్త షాకింగ్ గా ఉందని చెప్పారు.
Recommended Video

ఆస్పత్రికి తరలి వచ్చిన ప్రముఖులు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా పలువురు మంత్రులు..పార్టీల నేతలు గౌతమ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ...వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల..అనీల్ సైతం అపోలోకు చేరుకున్నారు. మంత్రి తలసాని సైతం ఆస్పత్రికి వచ్చారు. పలువురు మంత్రులు హైదరాబాద్ కు బయల్దేరారు. జేసీ ప్రభాకర రెడ్డి అపోలోకు వచ్చారు. చిన్న వయసులో గౌతమ్ మరణించటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చి గౌతమ్ భౌతిక కాయాన్ని సందర్శించారు.

రాత్రికి నెల్లూరు.. బుధవారం అంత్యక్రియలు
కాసేపట్లో గౌతమ్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఇంటికి తరలిస్తారు. ఈ రాత్రికి మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం తరలించనున్నారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. గౌతమ్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.దుబాయ్ లో ఏపీ ఎక్స్ పో లో వారం రోజుల పాటు పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి ఒక ఎంగేజ్ మెంట్ లో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటుగా కుటుంబ సభ్యుల తో కలిసి హాజరయ్యారు.

ఉదయం ఒక్క సారిగా కుప్పకూలిన మంత్రి
ఈ రోజు ఉదయం తన కార్యక్రమాలు ముగించుకొని... 7.45 గంటలకు సోఫాలో కూర్చున్న గౌతమ్ రెడ్డి ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు అపోలోకు తరలించారు. అప్పటికే గౌతమ్ రెడ్డి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రికి తీసుకొచ్చిన తరువాత దాదాపు 90 నిమిషాలు ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నం చేసారు.
కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 9.16 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా.. రెండు రాష్ట్రాల ప్రముఖులు గౌతమ్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, నెల్లూరు నుంచి పలువురు హైదరాబాద్ బయల్దేరారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications