MPగా వేరే పార్టీ నుంచి పోటీకి సిద్ధపడుతున్న మాజీ మంత్రి భర్త?
మేకతోటి సుచరిత అంటే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికికానీ, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి కానీ విధేయురాలు. మంత్రి పదవి నుంచి తప్పించడంతో మొదట్లో ఆమె కొంత మనస్తాపానికి గురయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా తప్పుకున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించినవారిలో ఒకే ఒక దళిత వ్యక్తి కావడంతో ఆమె దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

గంటల వ్యవధిలోనే బదిలీ
ఆదాయపు పన్నుశాఖ కమిషనర్ గా పదవీ విరమణ చేసిన సుచరిత భర్త మేకతోటి దయాసాగర్ రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఆయన ఖండించలేదు. పదవీ విరమణ చివరి దశలో విజయవాడ కమిషనర్ గా వచ్చారు. అయితే బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే అతన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. దయాసాగర్ బదిలీ వెనక ఢిల్లీలో చక్రం తిప్పే ఎంపీ పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. ఇటీవలే దయాసాగర్ పదవీ విరమణ చేశారు.

దయాసాగర్ కు అవకాశం ఇస్తారా?
పదవీ విరమణ చేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఎంపీగా పోటీచేయాలనుకుంటున్న దయాసాగర్ కు జగన్ అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వుడు నియోజకవర్గాలైన బాపట్ల, నెల్లూరు.. ఈ రెండింటిలో ఒకటి ఆశిస్తున్నారు. మరో రెండు నియోజకవర్గాలు అమలాపురం, చిత్తూరు ఉన్నప్పటికీ ఆయన ఆ రెండు నియోజకవర్గాలపైనే మొగ్గుచూపుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.

రంగం సిద్ధం చేసుకుంటున్న సుచరిత భర్త
ఒకవేళ అధికార పార్టీ నుంచి అవకాశం లభించకపోతే దయాసాగర్ రానున్న ఎన్నిల్లో జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీచేయాలనే యోచనలో ఉన్నారని, అందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రిగా మచ్చలేని పరిపాలన అందించిన సుచరిత వైఎస్ జగన్ ను కాదని వేరేపార్టీకి వెళ్లే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే దయాసాగర్ మాత్రం ఎంపీగా పోటీచేయడానికి సిద్దపడుతున్న తరుణంలో అవకాశం లభిస్తే వైసీపీ నుంచి లేదంటే జనసేన నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు. అయితే వీరు జగన్ గీసిన గీటును దాటి బయటకు వస్తారా? వేరే పార్టీ తరఫున పోటీచేస్తారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications