ఏపీకి వాతావరణశాఖ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు పొంచివుందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణశాఖ అంచనా ప్రకారం బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం.. శివారు ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

Meteorological Department warning to ap

మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలి పంజా విసిరింది. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోంది. తుఫాన్ తర్వాత ఈ తరహా వాతావరణం రోజురోజుకు పెరుగుతుంది. అలాగే ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు పొగమంచు తోడవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మిగ్ జాం తుఫానుతో చేతికందాల్సిన పంట నీటిపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+