మెట్రోపొలిస్ సందడి: అయ్యారే భోజనంబు (పిక్చర్స్)

హైదరాబాద్: బల్దియా అధికారులు కొంతకాలం క్రితం ప్రారంభించిన రూ.5 సబ్సిడీ భోజనాన్ని మెట్రోపొలిస్ విదేశీ ప్రతినిధులు కూడా శుక్రవారం రుచి చూశారు. ఈ భోజనాన్ని పంపిణీ చేస్తున్న హరేరామ సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత కేవలం రూ. 5కే సబ్సిడీ ఆహారాన్ని అందించే ఈ పథకం మరింత విస్తరించాల్సిన అవసరముందని సూచించినట్లు తెలిసింది.

విదేశీ ప్రతినిధుల సాంకేతిక పర్యటన అంశంలో భాగంగా పలు దేశాల ప్రతినిధులు ఆహార భద్రత కింద ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సందర్శించారు. అంతేగాక, ఆహా ఏమిరుచి అంటూ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భోజనం కోసం వచ్చిన వారికి వడ్డించి తమ ఉదారతను చాటుకున్నారు. కేవలం అయిదు రూపాయలకే ఎంతో పౌష్టికమైన ఆహారాన్ని ఎలా అందజేస్తున్నారన్న విషయంపై ఎంతో ఆసక్తిగా వివరాలు అడిగి తెల్సుకున్నారు.

ఇదిలా ఉండగా, విదేశీయులతో కూడిన మరో బృందం మహిళా సాధికారత సాధించేందుకు ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాల ఏర్పాటు, పనితీరును పరిశీలించింది. మహిళలను ఆర్థికంగా మరింత ప్రోత్సహిస్తే పేదరికం మరింత తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు.

మెట్రోపొలిసి ముగింపు

మెట్రోపొలిసి ముగింపు

మహానగరం వేదికగా అయిదురోజుల పాటు కొనసాగిన మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు శుక్రవారంతో పూర్తిస్థాయిలో తెర పడింది.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

ఈ నెల 6వ తేదీన ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన చిన్నారులతో తాము నివాసముంటున్న పట్టణం ఎలా ఉండాలన్న అంశంపై నిర్వహించిన సమావేశంతో ప్రారంభమైన ఈ సదస్సు శుక్రవారం వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం తొమ్మిది సాంకేతిక సందర్శనలు ముగియటంతో అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో తెరపడింది.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ సమావేశం ముగింపు రోజైన గురువారం సాయంత్రం వరకు దాదాపు 50 అంశాలపై సుమారు వివిధ రంగాల్లో నిపుణులైన పలు దేశాలకు చెందిన వారు ప్రసంగించారు.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

ప్రతి దేశంలో అక్కడ నెలకొన్న భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తూనే ప్రజలకు మెరుగైన వౌలికవసతులు, ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు సుమారు 148 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిపాదనల రూపకల్పనలకు తమ అనుభవాలను, అనుభూతుల్ని పరస్పరం పంచుకున్నారు.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

శుక్రవారం ఉదయం ‘వాతావరణంలో మార్పులు' అంశంపై చర్చ జరిగినానంతరం విదేశీ ప్రతినిధులు తొమ్మిది బృందాలుగా ఉదయం పదకొండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హైదరాబాద్ మెట్రోరైలు, మహిళల స్వయం సహాయక బృందాలు, ఐటి కారిడార్, సైబరాబాద్, హెరిటెజ్ కన్జర్వేషన్, ఫలక్‌నుమా హోటల్, ఔటర్ రింగురోడ్డు సందర్శనలు చేశారు.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

జైకా నిధులతో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అత్యవసర సేవలు, బల్దియా అమలు చేస్తున్న రూ. 5కే సబ్సిడీ ఆహార పథకాలపై కూడా ఈ సందర్శనలు నిర్వహించారు.

మెట్రోపొలిస్

మెట్రోపొలిస్

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అరుదైన మెట్రోరైలు ప్రాజెక్టు గురించి ఎంతో ఆసక్తితో అడిగి తెల్సుకున్నారు.

మెట్రోపొలిస్ ముగింపు

మెట్రోపొలిస్ ముగింపు

ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శించిన మరో ప్రతినిధుల బృందం నాటి కట్టడంలో ఉట్టిపడుతున్న కళానైపుణ్యాన్ని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+