చంద్రబాబు అంగీకారం: ఏపీలో ‘మియర్ బర్గర్’ పెట్టుబడులు
అమరావతి: ఏపీలో సోలార్ ప్యానెల్ తయారీ సంస్ధను ఏర్పాటు చేసేందుకు మియర్ బర్గర్ కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో ఇన్వెస్టర్ మీట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మియర్ బర్గర్ సంస్ధ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం భేటీ అయింది.
ఈ భేటీలో ఎగుమతి ఆధారిత పరిశ్రమల వైపు మియర్ బర్గర్ ఆసక్తి కనబర్చింది. ఇందులో భాగంగా ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం పట్టణాల్లో పెట్టుబడులకు ఆ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తుల్లో 50శాతం ఎగుమతి చేసి మిగిలిన 50శాతం ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తామని కంపెనీ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సంస్ధ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాగా దావోస్‌లో రేపటి (జనవరి 20) నుంచి 23 వరకూ ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొనున్న సంగతి తెలిసిందే.
ఇందు కోసం ఇప్పటికే చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్‌కు చేరుకుంది. నాల్గవ పారిశ్రామిక విప్లవం అనే నినాదంతో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మంత్రులు, దిగ్గజ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామరాజన్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
సీఐఐ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని సంస్థలను ఆహ్వానించే దిశగా, బ్రాండ్ ఏపీని విశ్వవ్యాప్తం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు.
Off to Zurich to take part in the Investors Meet before I head to Davos for the @wef Annual Summit. Will elaborate on opportunity in AP.
— N Chandrababu Naidu (@ncbn) January 19, 2016 -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications