టీడీపీకి మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్..!!
టిడ్కో నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేసారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్లలో ఒకరైన నివాసం ఉంటున్నారా అని నిలదీశారు. నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లను టీటీడీపీ హయాంలో ప్రారంభించారని చెప్పుకొచ్చారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు.
గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. ప్రజలు నేరుగా వచ్చి నివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామన్నారు. వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇచ్చామని చెప్పారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు.. పదే పదే టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని.. గుడివాడ టిడ్కో ప్లాట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రారంభిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సీఎం వైయస్ జగన్ ఇస్తున్న ఇళ్లకు.. పదేపదే తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రారంభించిన సెల్పీల ఉద్యమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పలువురు టిడ్కో ఇళ్ల నిర్మాణం పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. దీని పైన బహిరంగ సభల్లోనూ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ సెల్ఫీల గురించి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు టిక్కడో లేఅవుట్‌లో అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి సురేష్ టీడీపీ నేతలను చర్చకు రావాలని సవాల్ చేసారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లే అవుట్ల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల న ముఖ్యమంత్రి జగన్ గుడివాడలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications