వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు పిచ్చిపట్టింది: ఆదినారాయణ, జెండాతో ఇబ్బందిపడ్డ జగన్, అసహనం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాదయాత్రలో సాధ్యం కానీ హామీలు ఇస్తే ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

పోయేకాలం, తిక్కలోడు: జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు, మంత్రుల పైనాపోయేకాలం, తిక్కలోడు: జగన్‌పై జేసీ సంచలన వ్యాఖ్యలు, మంత్రుల పైనా

 జగన్‌కు పిచ్చి పట్టింది

జగన్‌కు పిచ్చి పట్టింది

జగన్‌కు పిచ్చి పట్టిందని ఆదినారాయణ రెడ్డి దుమ్మెత్తి పోశారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీలు అమలు కావాలంటే ప్రపంచ బ్యాంకులో దాచిన తన(జగన్) సొమ్మును బయటకు తీయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. జగన్‌ది దొంగాట అని, దొంగ మాటలు మానుకోవాలన్నారు.

 టీడీపీ నేతలు భయపడుతున్నారా?

టీడీపీ నేతలు భయపడుతున్నారా?

పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీలను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు వైసీపీ నాయకులు. జగన్ ఇస్తున్న హామీల గురించి మాట్లాడటం అలా మాట్లాడటం అంటే భయపడుతోందని తేలిపోయిందని అంటున్నారు.

 జెండా ఆవిష్కరణ, జగన్ ఇబ్బంది

జెండా ఆవిష్కరణ, జగన్ ఇబ్బంది

ఇదిలా ఉండగా, బుధవారం జగన్ వైసీపీ జెండా ఎగురవేసే క్రమంలో ఇబ్బంది పడ్డారు. కర్నూలు జిల్లా కోటకందుకూరులో ఆయన వైసీపీ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు రెండుసార్లు ప్రయత్నించినా అది ఎగరలేదు. అసహనానికి లోనైన జగన్.. ఓ బాలుడిని పైకి ఎక్కించి జెండాను ఆవిష్కరించారు.

 మేం పార్టీ మారటం లేదు

మేం పార్టీ మారటం లేదు

ఇదిలా ఉండగా, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. దీనిని వారు ఖండించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాము పార్టీ మారేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు.

English summary
Minister and Telugu Desam Party leader Adinarayana Reddy fires at YSR Congess Party chief YS Jagan for promises in padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X