మా అంచనాలు మారిపోయాయి - బాధ్యతగా వ్యవహరిస్తాం : మంత్రి అమర్నాధ్..!!

ఏపీలో పెట్టుబడులు అంచనాలకు మంచి వచ్చాయని మంత్రి అమర్నాధ్ పేర్కొన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని మంత్రి అమర్నాధ్ చెప్పారు. తమ అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చాచన్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన నమ్మకం.. పాలన చూసిన తరువాతనే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. రెండు లక్షల కోట్లకు పైగా వస్తాయని తాము చెబుతూ వచ్చమన్నారు. కానీ..అంచనాలకు మించి పారిశ్రామిక వేత్తల నుంచి మద్దతు లభించదని చెప్పారు. 13 లక్షల కోట్ల మేర ఏపీకి పెట్టబడులు వచ్చాయని..వీటిని పరిశ్రమలుగా మార్చటం తమ ముందున్న బాధ్యత అని చెప్పారు. దీని కోసం సీఎం జగన కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.

సదస్సు సూపర్ హిట్ అయింది

ఏపీలో కొత్త చరిత్ర మొదలైందని మంత్రి గుడివాడ అమర్ నాద్ పేర్కొన్నారు. రెండు లక్షల కోట్లకు పైగా నాలుగు నుంచి అయిదు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అంచనా వేసామని చెప్పారు. కానీ, అనూహ్యంగా రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రావటం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని వివరించారు. తాము తమ నాయకత్వం గురించి మాట్లాడటంతో కొత్త దనం లేదని.. పెట్టుబడుల కోసం ఏపీకి వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఏపీలో పాలన..జగన్ నాయకత్వం గురించి ప్రశంసించారని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పైన నమ్మకంతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అప్పటికప్పుడు వేదిక పైన తన పెట్టుబడి గురించి ప్రకటన చేసారని వివరించారు.
ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేలా

ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేలా


ఇప్పుడు ఈ పెట్టుబడులను వాస్తవిక రూపంలో అమలయ్యే చూడాల్సిన బాధ్యత తమ పైన ఉందని మంత్రి చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎంఓ- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులు ఈ టీంతో ప్రతీ వారం సమీక్ష చేస్తారని చెప్పారు. పెట్టుబడుల ఎంఓయూలు గ్రౌండ్ అయ్య వరకూ అధికారుల టీం పని చేస్తుందని వివరించారు. పెట్టుబడి దారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అంటుందని ముఖ్యమంత్రి సదస్సు వేదికగా ఇచ్చిన హామీని మంత్రి అమర్నాధ్ గుర్తు చేసారు. పరిశ్రమలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీ

ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీ


ఈ సదస్సులో మొత్తం 14 రంగాల పైన చర్చలు జరిగాయని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన మూడున్నారేళ్ల కాలంలో 89 శాతం ఎంఓయూలు వాస్తవరూపం దాల్చాయని వివరించారు. ఇప్పుడు సదస్సులో పెట్టుబడులతో ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. భూములు, నీరు, విద్యుత్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లోనే అన్ని అనుమతులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం కొత్తగా పరిశ్రమల పాలసీ అమల్లోకి తెస్తుందని మంత్రి చెప్పారు. ఈ రెండు రోజుల పాటు ఏపీలో పెట్టుబడుల దిశగా ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలు సీఎం జగన్ ను అభినందించిన విషయాన్ని మంత్రి అమర్నాధ్ గుర్తు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+