జేఏసీ నేత బొప్పరాజు వ్యవహర శైలిపై పలు అనుమానాలు - అనగాని..!!

ఏపీ ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగ సమస్యల పైన తాజాగా బొప్పరాజు ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఉద్యోగుల పోరాటం పైన ప్రకటన చేసారు. ఆ సమయం లో బొప్పరాజు తీరు పైన మంత్రి స్పందించారు. బొప్పరాజు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఉద్యోగులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు.

ఏపీ ఉద్యోగ జేఏసీ నేత బొప్పరాజు పైన మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా బొప్పరాజు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బొప్పరాజు ఉద్యోగ సమస్యల పైన పని చేస్తున్నారా.. పొలిటికల్ అజెండాతో పని చేస్తున్నారా అంటూ సీరియస్ అయ్యారు.బొప్పరాజు వ్యవహర శైలిపై పలు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఉద్యోగుల కు - ప్రభుత్వానికి ఉన్న సఖ్యతను చెడగొట్టడానికి బొప్పరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నార ని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో పెట్టిన బకాయిలనూ కూటమి ప్రభుత్వమే పెట్టిందనే రీతిలో బొప్పరాజు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని ఆగ్రహించారు. రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం చూస్తుంటే బొప్పరాజు ఆలోచనా ధోరణి ఏంటో అర్థమవుతోందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై బొప్పరాజుతో సహా వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

 మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
minister-anagani-satyaprasad-seriously-reacts-over-employees-association-leader-bopparaju-latest-co

బొప్పరాజు తీరు పై ఆగ్రహం

ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని అనగాని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక కష్టాలున్నా... ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలోని పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ తాము చెల్లించామని స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఇంకా చాలా చేశామని అన్నారు. విడతల వారీగా వేల కోట్లు ఉద్యోగుల బకాయిల నిమిత్తం చెల్లిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను తాము గౌరవిస్తున్నామని, చర్చలు జరుపుతున్నామని అన్నారు. బొప్పరాజు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. బొప్పరాజు వ్యవహరశైలిని ఉద్యోగులూ గమనించాలని కోరారు. ఉద్యోగుల అజెండా కంటే.. పొలిటికల్ అజెండానే బొప్పరాజు అమలు చేస్తున్నట్లుగా కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్నారు. సీఎం చంద్రబాబును అవమానించేలా, అవహేళన చేసేలా బొప్పరాజు సభ నిర్వహించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+