వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అలా - చంద్రబాబు ఇలా : టీడీపీకి మంత్రి అనిల్ సవాల్ - ఒంటరిగా వస్తారా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యుడు రుహుల్లా ప్రమాణ స్వీకారం వేళ సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ సమయంలో మంత్రి అనిల్ టీడీపీ పైన విరుచుకు పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేసి సభ బహిష్కరించి బయటకు వెళ్లిన అంశాన్ని ప్రస్తావించారు. కానీ, ఆయన పైన నమ్మకం లేని టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వచ్చి గందరగోళం చేస్తున్నారని విమర్శించారు. నాడు సభలో జగన్ తాను సీఎం అయ్యే వరకూ సభకు రానని చెప్పి బహిష్కరిస్తే..జగన్ తోనే ఎమ్మెల్యేలమంతా కలిసి నడిచామని చెప్పారు.

జగన్ అలా - చంద్రబాబు ఇలా

జగన్ అలా - చంద్రబాబు ఇలా

తిరిగి 151 మంది ఎమ్మెల్యేలతో సభలో కాలు పెట్టారని చెప్పుకొచ్చారు. వీళ్ల నాయకుడిని వీరే నమ్మలేని పరిస్థితిలో టీడీపీ ఎమ్మెల్సీలు .. ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే ఎమ్మెల్యే కాలేక.. ఎమ్మెల్సీగా సభలోకి వచ్చారని.. ఇప్పుడు చంద్రబాబు వెంట వెళ్తే అది కూడా పోతోందనేది వారి బాధ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ మీద నమ్మకం తో 2024 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం తమకు ఉందని అనిల్ స్పష్టం చేసారు. టీడీపీ దమ్ము ఉంటే వాళ్లు కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పలగరా అని సవాల్ చేసారు.

సవాల్ చేస్తున్నా...చెప్పే ధైర్యం ఉందా

సవాల్ చేస్తున్నా...చెప్పే ధైర్యం ఉందా

టీడీపీ నేతలు ఎవరైనా.. పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పే ధైర్యం ఉందా అంటూ నిలదీసారు. సభలో ఉన్న ఏ టీడీపీ సభ్యుడు అయినా..ధైర్యం ఎంటే టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని చెప్పాలని ఛాలెంజ్ చేసారు. ఒక మైనార్టీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీడీపీ సభ్యులు అడ్డుకోవటం పైన వైసీపీ సభ్యులు నిలదీసారు. మాజీ మంత్రి లోకేష్ కొత్త సభ్యుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సభలో మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు గురించి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వివరించారు. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.

సభలో గందరగోళం..వాయిదా

సభలో గందరగోళం..వాయిదా

మంత్రి వెల్లంపల్లి టీడీపీ సభ్యుల పైన ఫైర్ అయ్యారు. ఈ గందరతోఘ నడుమే రుహుల్లా ప్రమాణ స్వీకారం జరిగింది. కల్తీ సారా మరణాల పైన చర్చ చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు. సభలో గందరగోళం కొనసాగుతుండటంతో ఛైర్మన్ సభను 15 నిమిషాలు వాయిదా వేసారు. ఇదే అంశం పైన శాసనసభలోనూ గందరగోళం చోటు చేసుకుంది.

దీంతో..శాసనసభ స్పీకర్ టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేసారు. కాసేపట్లో శాసనసభలో పెగాసస్ అంశం పైన స్వల్ప కాలిక చర్చ జరగనుంది. టీడీపీ సభ్యులు లేకపోవటంతో..అధికార వైసీపీ దీని పైన చర్చించి..ఎటువంటి నిర్ణయం తీసుకుటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Minister Anil Challenge to TDP for coming elections, can TDP fight alone aqainst YCP with out allilance. He says YSRCP contest as single party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X