జగన్ కు షాకిచ్చే విషయం చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ పరిపాలనా విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులకు, నిర్ణీత సమయంలో జీతాలు చెల్లిస్తున్నామన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన పరిపాలన విధానాలే కారణమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇదే సమయంలో జగన్ పై బాంబు పేల్చారు.

ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉండటం ముదావహం
రాష్ట్ర ఎన్జీవో సంఘం బాధ్యులు మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అపారమైన ఆదరాభిమానాలు ఉన్నాయ న్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మానసిక ఒత్తిడిని, అవమానాలను భరించి ప్రస్తుత ప్రభుత్వానికి అండగా నిలవడం ముదావహం అన్నారు.

Minister atchannaidu gave a shock to ys jagan inquiry on financial destruction in ycp regime

మీరే ప్రభుత్వంలో కీలకం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా నిల్వ లేనప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారని, ప్రజలు కూడా తమ వంతు సాయం అందించారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభ పరిణామం అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చెప్పారని, ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలన్నారు.

గతంలో ఉద్యోగుల గోడు కూడా వినని పాలన
ఉద్యోగ సంఘాల నాయకులు గతంలో తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితులు ఇకముందు ఉండవన్నారు. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉద్యోగుల సమస్యలను వినడంతో పాటు ప్రతి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అంతిమంగా రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా ఉద్యోగులు, ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ఆయా శాఖలలో విచారణ
గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయా శాఖలలో విచారణ కొనసాగుతోందని, రాష్ట్రానికి నష్టం కలిగించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రికి మనం అవకాశం ఉన్నంత మేరకు సహకరించి రానున్న 5 ఏళ్లలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు పునరంకితం కావాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+