శ్రీకాళహస్తి ఆలయంలో మంత్రి బొజ్జల భార్య హల్‌చల్
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ హల్‌చల్ చేశారు. శనివారం ఆలయంలోని అన్ని విభాగాలను ఆమె తనిఖీలు చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామంటూ ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవలే శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో తెలుగుదేశం మున్సిపల్ ఛైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రాంరెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి భార్య తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహా శివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రాంరెడ్డిల మధ్య శుక్రవారం విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications