ఆ రెండు పార్టీలు ఉండవు, గుండు కొట్టించుకుంటా - మంత్రి బొత్సా శపథం..!!

మంత్రి బొత్సా సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పైన విరుచుకుపడ్డారు. వచ్చే ఉగాది తరువాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని.. ఒక వేళ ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని బొత్సా శపథం చేసారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ రెండు పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయన్నారు. కొంతమంది నేతలు మాట్లాడితే తమ చేతులు, కాళ్లు చూపిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్న మూసేస్తే..తమ్ముడు కొత్త దుకాణం: ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనే వ్యక్తి, మరొకరు అవగాహన లేని చేతలు మాటల సెలబ్రెటీ అంటూ చంద్రబాబు..పవన్ పైన బొత్సా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడు న్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే పెద్దవాడైపోయానని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Botsa Satyanarayana

అన్న పార్టీ మూసేసిన తరువాత తమ్ముడు దుకాణం తెరిచారని ఎద్దేవా చేసారు. వాలంటీర్ల గురించి రోజుకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. చెప్పుతో కొడతామని విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు అందరికీ ఉంటాయనే విషయం ఆ రెండు పార్టీలు గుర్తించుకోవాలన్నారు.

జగన్, విజయమ్మ పెట్టమన్నారా: జనసేన తన రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లు అయ్యిందని, వారి రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలంటేనే అసహ్యం వేస్తోందన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎందుకని పవన్ కల్యాణ్ అంటుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. వాటిని జగన్, విజయమ్మ పెట్టమన్నారా అని ప్రశ్నించారు.

ఎక్కడికి అక్కడ అభిమానంతో పెడుతున్నారని చెప్పుకొచ్చారు. రాజకీయాలంటే అసహ్యం వేస్తోందని బొత్సా వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు శంకుస్థాపన చేసి తోటపల్లి ప్రాజెక్టులు అంతా నేనే చేశానని చంద్రబాబు చెప్పటానికి సిగ్గు లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కిడ్నీ పేషెంట్ లకు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక్క హాస్పిటల్ ఇవ్వలేదని బొత్సా చెప్పుకొచ్చారు.

మట్టి కొట్టుకుపోతారంటూ: జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారంటూ బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు.రాజకీయ అనుభవంతో చెబుతున్నా ప్రజల మంచి చెయాలనే తపన వారికి లేదని వ్యాఖ్యానించారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప చిత్తశుద్ది లేదని బొత్సా పేర్కొన్నారు. గ్రామాల్లో సాంకేతిక లోపాలతో కొందరికి పథకాలు వర్తించటం లేదని, దానికే ఏదో జరిగిపోయినట్లు ప్రరచారం చేస్తున్నారని మంత్రి సీదల అప్పలరాజు పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు ఎందుకు వచ్చారో..ఎందుకు వెళ్లిపోయారో తెలియదని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మంత్రి బొత్సా వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. వీటి పైన టీడీపీ, జనసేన స్పందన చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+