Earthquakes: ఒకేసారి రెండు భారీ భూకంపాలు! అంచనా వేయలేనంత ప్రాణనష్టం?

ప్రకృతి ప్రకోపానికి వెనిజులా దేశం ఒక్కసారిగా గుండె జారిపోయేలా వణికిపోయింది. కరీబియన్ తీర ప్రాంతంలో బుధవారం సాయంత్రం కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి తీవ్ర కలకలం రేపాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూమి కంపించగా, ఆ తూఫాను వేగాన్ని మరువక ముందే.. సరిగ్గా 39 సెకన్లకే దానికి తోడుగా మరో భీకరమైన 7.5 తీవ్రతతో రెండో భూకంపం ముంచెత్తింది. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో దీని ప్రభావం ఊహించని స్థాయిలో పెరిగింది.

హాహాకారాలు.. రన్‌వేల నుంచి వీధుల దాకా ఒకటే పరుగులు..

భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో రాజధాని కారకాస్‌తో పాటు మొరోన్, మైకేటియా నగరాలు తీవ్రంగా దద్దరిల్లాయి. మైకేటియా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అటూ ఇటూ పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇంట్లో వస్తువులన్నీ ఒక్కసారిగా కిందపడిపోయాయి. భీకరమైన శబ్దం వచ్చింది. నా జీవితంలో ఇంతటి భయంకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు" అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Venezuela Earthquake Back-to-Back Doublet Quakes with 7 5 Magnitude Rock Coast High Casualties Feared
భూకంపం, సునామీ కోరల్లో ఆసియా దేశాలు
భూకంపం, సునామీ కోరల్లో ఆసియా దేశాలు

కూలిన భవనాలు.. వేలాది మంది ప్రాణాలు గాల్లోనేనా?

ఈ భూకంప తీవ్రతకు వందలాది ఇళ్లు, ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ ఘోర విపత్తుపై స్పందించిన అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ విపత్తులో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, మరణాల సంఖ్య 10,000 నుంచి ఏకంగా ఒక లక్ష వరకు ఉండే ప్రమాదం ఉందని ప్రాథమిక అంచనా వేసింది. దేశంలోని ట్రుజిల్లో, యారకుయ్, కరాబోబో, మిరాండా వంటి పలు రాష్ట్రాలు ఈ భూకంప ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

భారీ భూకంపం- వణికిన తూర్పు తీరం
భారీ భూకంపం- వణికిన తూర్పు తీరం

సునామీ అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం..

భూకంపం ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో అధికారులు మొదట ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్‌తో పాటు అరుబా, కురాకో ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే గంట తర్వాత ఆ ప్రమాదం తప్పడంతో హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన అత్యవసర రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇంకా ఆఫ్టర్ షాక్స్ (భూప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ ఇళ్లలోకి వెళ్లవద్దని, రోడ్లపై అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+