విశాఖ కేంద్రంగా చంద్రబాబును ఫిక్స్ చేసిన బొత్సా...!!
ఏపీ ఎన్నికల వేళ విశాఖ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్డీఏ కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా మారింది. ఇదే సమయంలో బీజేపీ కూటమిలో ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఎన్నికల అస్త్రం గా మారుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకోవటంతో కేంద్రం పైన కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశం పైన బీజేపీతో జత కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.
చంద్రబాబు ఎన్నికల సభల్లో భాగంగా రేపు (ఆదివారం) విశాఖ రానున్నారు. గాజువాక సభలో పాల్గొంటారు. మంత్రి బొత్సా ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జగన్ నేరుగా ప్రధానికి లేఖ రాసారని...ప్రయివేటీకరణ నిర్ణయం ఉప సంహరించుకోవాలని కోరారని గుర్తు చేసారు. స్టీల్ ప్లాంట్ అంశం పై పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. గాజువాక వస్తున్న చంద్రబాబు ప్రజలు నిలదీయకపోయినా..ఎన్డీఏ భాగస్వామిగా స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు.

అనకాపల్లిలో క్యాష్ పార్టీ మినహా, టీడీపీకి బీసీ నాయకత్వమే లేదాఅని ప్రశ్నించారు. వయసు,ప్రజా వ్యతిరేకత కారణంగా చంద్రబాబు అయోమయంలో మాట్లాడుతున్నారని బొత్సా ఎద్దేవా చేసారు. చంద్రబాబు, పవన్ మాట మీద నిలబడని నేతలని బొత్సా వ్యాఖ్యానించారు. బలహీనవర్గాలంటే వారికి చిన్నచూపు అని చెప్పుకొచ్చారు. వాళ్లలాగా తాము మాయ మాటలు చెప్పమన్నారు. జగన్ ఏదైతే చెబుతారో అదే చేస్తారని.. ఏదైతే చేస్తారో అదే చెబుతారని వివరించారు. మత్య్సకారులను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన ఏకైక నాయకుడు జగన్ అని బొత్సా చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో మత్య్సకారులకు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారని చెప్పారు. ఒక మత్స్యాకారుడిని రాజ్యసభకు పంపారని బొత్సా వివరించారు.












Click it and Unblock the Notifications