ఏపీలో మరోసారి అధికారం వైసీపీదే
ఏపీలో ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు గా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మరోసారి జగన్ నేతృత్వంలోని వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ గెలుస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్లు అంటే చంద్రబాబుకు నచ్చదని ఆయన మండిపడ్డారు.

ప్రతి విషయంలో చంద్రబాబు లేఖలు రాస్తూనే ఉన్నారని, ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేసి అల్లర్లకు కారకుడయ్యారని బొత్స చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగసిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.మరోవైపు జగన్ సీఎం కావడం ఖయమని భావిస్తోన్న వైసీపీ శ్రేణులు జగన్ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైజాగ్‌లోని అన్ని హోటల్స్ బుక్ చేసినట్టుగా సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications