క్లీన్ స్వీప్ చేయబోతున్నాం: మంత్రి

TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు.

ఈ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ స్పందించారు. తనకు ఎవరూ సలహాలు ఇవ్వకూడదనడం హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నాయకులు, కాపు సామాజిక వర్గాన్ని అవమానించినట్టేనని అన్నారు.

Minister Chelluboina Venu Gopal Krishna slams Chandrababu Naidu and Pawan Kalyan

ఈ ఉదయం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు పార్టీలు కూడా తమ అజెండా ఏమిటనేది స్పష్టం చేయలేకపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే సభ పెట్టినట్టయిందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

వైఎస్ జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ కల్యాణ్ చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు చెల్లుబోయిన. పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్యవాదులు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఎప్పటికీ రాబోదని గుర్తు చేశారు.

వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ అయిదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారని, అదే తమను గెలిపిస్తుందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 175కు 175 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారాయన. ప్రజలు జగన్‌కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+