చంద్రబాబు హయాం బ్రోకర్లమయం; ఆయనను జనం నమ్మరు: మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబునాయుడు పొత్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోమారు ఏపీలో రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. అధికార వైసీపీ నేతలు చంద్రబాబును, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ ఎంపీ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని, ఓటమి భయంలో ఉన్న వాళ్ళే పొత్తుల గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు.

 చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు

చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు


చంద్రబాబు హయాంలో ఏపీ పాలనను, ప్రస్తుత వైసీపీ పాలనను పోల్చి చెప్పారు. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాం అంతా బ్రోకర్ల మయం అంటూ మండిపడ్డారు. ప్రజలు ఇప్పుడు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు అంటూ ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏపీ ప్రజలకు నయాపైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు.

 చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాల వర్తింపుకి తాయిలాలు

చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాల వర్తింపుకి తాయిలాలు


సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. చంద్రబాబు పాలనంతా బ్రోకర్ల మయంగా, అవినీతి పరుల మయంగా ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. చంద్రబాబు హయాంలో తాయిలాలు చెల్లించడంతో పాటు, ఇళ్ళ మీద పసుపు జెండా ఎగరాలి అని, అప్పుడే సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని చెప్పేవారని, దీనిపై కలెక్టర్ లకు ఫిర్యాదు చేసినా జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాలి అంటూ సూచించేవారని ధర్మాన ప్రసాదరావు సంచలన ఆరోపణలు చేశారు

మళ్లీ ఉద్దరిస్తాను అంటే చంద్రబాబును నమ్మేదెవరు

మళ్లీ ఉద్దరిస్తాను అంటే చంద్రబాబును నమ్మేదెవరు


నేడు మళ్ళీ చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మళ్లీ ఉద్దరిస్తాను అంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ మాత్రం ఉద్ధరిస్తారో ఏపే ప్రజలకు బాగానే తెలుసని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+