'తెలంగాణ విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు అనాగరికం'
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఉదయం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం గవర్నర్‌ను కలిసే ముందు ఓ కార్యక్రమంలో మాట్లాడుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా ఖండించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ప్రకటించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము రెండడుగులు వెనక్కి తగ్గితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిగదీసుకుని కూర్చుందని ఆయన ఆరోపించారు. విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా బాధ్యతగా వ్వయహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మంగళవారం ఎంసెట్ విషయంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ నరసింహాన్‌ను మంత్రి గంటా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంసెట్ నిర్వహణ ఏపీ పరిధిలోకే వస్తుందన్న గవర్నర్ వాదననూ పట్టించుకోకుండా జగదీశ్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని గంటా ఆరోపించారు.












Click it and Unblock the Notifications