పవన్ చూసి ఆడపిల్లలు భయడుతున్నారు - మంత్రి అమర్నాధ్..!!

జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు. పవన్ ఉన్మాదిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ చెబుతున్నవి కాగ్ లెక్కలా...చంద్రబాబు లెక్కలా అని ప్రశ్నించారు. కమెడియన్లు, సైడ్ యాక్టర్స్ కు ఉన్న విలువ పవన్ కు లేదని వ్యాఖ్యానించారు. వాళ్ళల్లో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలయ్యారు.. పవన్ మాత్రం కాలేకపోయారని ఎద్దేవా చేసారు.

మంత్రి కీలక వ్యాఖ్యలు
మంత్రి అమర్నాధ్ జనసేనాని పవన్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. నిత్య కళ్యాణాలతో పవన్ తన పేరును సార్థకం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎవరికి తాళి కట్టేస్తాడో అని ఆడపిల్లలు పవన్ ను చూసే భయపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్లపై పవన్‌ వ్యాఖ్యలు అత్యంత గర్హనీయం.. తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

Minister Gudivada Amarnath

ధైర్యముంటే.. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పాలని సవాల్ చేసారు. పవన్‌ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే ప్రజలే చెప్పులు చూపిస్తారనిహెచ్చరించారు. చంద్రబాబుకు సేనాధిపతిగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేనను టీడీపీలో కలిపేస్తే.. ప్యాకేజీ ఆగిపోతుందని భయమా అని ప్రశ్నించారు.

వపన్ వ్యాఖ్యలపై ఆగ్రహం
చంద్ర బాబు ఇచ్చే స్క్రిప్టు, ప్యాకేజీ కోసం వారాహి విజయ యాత్రలా అని మంత్రి నిలదీసారు. నీ రాజకీయ అవసరాలకు తల్లి, భార్య గుర్తొచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నీ మూడో భార్య గురించి రాతలు రాసింది టీడీపీ అనుకూల మీడియాలోనే కదా అంటూ ప్రశ్నించారు. వారాహి రెండో విడత యాత్రలో పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని..తీవ్ర నిరాశతో ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

రాజకీయంగా ఎదగలేనని, తనకు ఎవరూ ఓట్లు వేయరని, ఎమ్మెల్యేను కూడా కాబోనని, తానసలు రాజకీయాలకు పనికి రానని ప్రజలు అనుకుంటున్నారన్న ఆవేదన, బాధలో ఉన్నట్లున్నాడు. అందుకే ఒక ఉన్మాది మాదిరిగా మాట్లాడారని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేనా అవి అని ప్రశ్నించారు.

పవన్ కు గౌరవం లేదు
నిత్యం సీఎం జగన్ ను..ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ, హావభావాలు ప్రదర్శించడం సరికాదని హితవు చెప్పారు. నిన్నటి పవన్‌ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు కూడా ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆయన మాటల్లో ఎక్కడా వాస్తవం లేదన్నారు. పవన్ నిన్నటి మాటలు విన్నాక, ప్రజలు కూడా చెప్పు చూపించే పరిస్థితి వస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.

సీఎంకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇక నుంచి తాను ఏకవచనంతో మాట్లాడతానని అన్నారని... కానీ ఆయన ఏనాడు సీఎం జగన్ కి గౌరవం ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు తప్ప, పవన్‌ ఎవరినీ గౌరవించలేదన్నారు. గతంలో చాలాసార్లు జగన్‌రెడ్డి అనే ఏకవచనంతోనే సంబోధించారని మంత్రి అమర్నాధ్ గుర్తు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+