విశాఖ నుంచి సీఎం జగన్ పాలన - ముహూర్తం ఇదే: మంత్రి అమర్నాథ్ ..!!

ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన పై మంత్రి అమర్నాధ్ క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఢిల్లీ..విశాఖ వేదికగా వెల్లడించారు. దీని పైన ఇప్పుడు మంత్రి అమర్నాథ్ స్పష్టత ఇచ్చారు. సీఎం విశాఖ కేంద్రంగా పాలన ఎప్పటి నుంచో వెల్లడించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో చేసుకున్న ఒప్పందాల అమలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ఒప్పందాల ద్వారా తమ ప్రభుత్వం పైన మరింత బాధ్యత పెరిగిందని అమర్నాథ్ చెప్పారు. రామాయపట్నం పోర్టు ప్రారంభం పైన మంత్రి స్పష్టత ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ మరి కొద్ది రోజుల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ముఖ్యమంత్రి విశాఖ రాబోతున్నారని స్పష్టం చేసారు. ఢిల్లీలో సీఎం తొలుత విశాఖ కు మారుతున్నట్లు చెప్పారని..ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా కొద్ది రోజుల్లోనే అంటూ చెప్పుకొచ్చారని మంత్రి వివరించారు. ఆ సమయం రోజుల్లోకి వచ్చేసిందన్నారు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోందన్నారు. అటు సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతన్న నేపథ్యంలో కోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. తీర్పు ఆలస్యం అయితే సీఎం జగన్ విశాఖ లో క్యాంపు కార్యాలయం ప్రారంభించి అక్కడ నుంచి పాలన మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Minister Gudivada Amarnath says CM Jagan move to Vizag Administration from Vizag in next Academic year

విశాఖ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా ఏపీకి రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. దీని ద్వారా తమ పైన మరింత బాధ్యత పెరిగిందని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయ వంతం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగానే ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించ లేకపోయినట్లు వివరించారు. ఈనెల 18 తర్వాత విడుదల అవుతుందని చెప్పారు. డిశంబర్ 23 నాటికి రామాయపట్నం ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయని చెప్పిన మంత్రి..ఆ రోజు తొలి వెసల్ రాబోతోందని వెల్లడించారు. సీఎం జగన్ బ్రాండ్... కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని వివరించారు. ఎంఓయూల పర్యవేక్షణకు చీఫ్ సెక్రెటరీ తో ఒక హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసామని..ప్రతీ వారం సమీక్ష చేస్తారని మంత్రి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+