చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది.. బినామీ ఆస్తుల కోసమే ఉద్యమాలు : కన్నబాబు
అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్దిని చంద్రబాబు ఇంకెంతకాలం అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. అభివృద్ది వికేంద్రీకరణ,మండలి రద్దులను అడ్డుకుంటే ప్రజలు చంద్రబాబును మరింతగా తిరస్కరిస్తారని అన్నారు.
కేవలం బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు బయటపడుతుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రజలు ఇంకా వెనుకబాటుతనంలోనే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.

ఇక కాపు మహిళల కోసం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకంపై కన్నబాబు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకు ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు జగన్ భరోసా ఇస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు,అన్ని వర్గాలు సమానంగా అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications