ఆరు నూరైనా.... ఆ తేదీ నాటికి ఆ పని చేసి తీరుతాం... : మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న అతి భయంకరమైన రాక్షసుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. లోక కళ్యాణం కోసం రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసుడి తరహాలో చంద్రబాబు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని సీఎం జగన్ పరితపిస్తున్నారని అన్నారు. జగన్ అమలుచేస్తున్న పథకాలు,ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్దిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

ప్రజల గుండెల్లో జగన్ ఎక్కడ దేవుడై పోతాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు ఓ దుర్మార్గుడు అని,మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మహిళల పేరున జగన్ ఇళ్ల పట్టాలు అందించడానికి సిద్దమవుతుంటే కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు.

minister kodali nani slams chandrababu naidu over house sites pattas

ఆరు నూరైనా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని ఆయన తెలిపారు.గాంధీ జయంతి లేదా దసరా నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని నాని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే తాము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీరుతాతమన్నారు.

Recommended Video

    Actor Nani's V Movie Heading For An OTT Release ? || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+