వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీప్ లిక్కర్ కనిపెట్టిందీ ఆయనే: పార్టీ మారాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు కొడాలి నాని సలహా

|
Google Oneindia TeluguNews

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. మృతులందరూ నాటుసారాను తాగడం వల్లే మృత్యువాత పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. ధీటుగా స్పందిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడికి దిగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లను తవ్వి తీస్తోంది.

240 బ్రాండ్లకు బాబు అనుమతి..

240 బ్రాండ్లకు బాబు అనుమతి..


తాజాగా- ఈ అంశం మీద పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. అసెంబ్లీ వేదికగా చెలరేగిపోయారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలను సంధించారు. అదే స్థాయిలో ఆరోపణలను గుప్పించారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 240 మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. జే- బ్రాండ్స్ అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెబుతోన్నవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతి పొందినవేనంటూ జీవోలు సైతం ఉన్నాయని చెప్పారు.

 అల్జీమర్స్ వల్ల మరిచిపోయారేమో..

అల్జీమర్స్ వల్ల మరిచిపోయారేమో..

ప్రెసిడెన్షియల్ మెడల్, బూమ్‌ బూమ్ వంటి బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన నిష్ట దరిద్రుడు చంద్రబాబేనని మండిపడ్డారు. దీనికి సాక్ష్యంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన జీవోలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ చెబుతోండటంలో అర్థం లేదని అన్నారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడనడానికి ఇదే నిదర్శనమని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

23 సీట్లకు పరిమితం చేసినా..

23 సీట్లకు పరిమితం చేసినా..

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం చేశాడని, అయినా టీడీపీ సభ్యులకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. చంద్రబాబును కొనసాగిస్తే- తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో.. ఏపీలోనూ అదే జరుగుతుందని అన్నారు. తాము సొంతంగా గెలవలేమని టీడీపీకి అర్థమైందని, అందుకోసమే పొత్తుల కోసం అర్రులు చాస్తోందని ఆరోపించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నపార్టీ కూడా సర్వనాశనమౌతుందని చెప్పారు.

 పార్టీ మారండి..

పార్టీ మారండి..

తమ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే తాము చేసిన తప్పులను కూడా ఇప్పుడు తెర మీదికి తీసుకొస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. టీడీపీ సభ్యులు పార్టీ మారాలని ఆయన సలహా ఇచ్చారు. లేదా చంద్రబాబును అయినా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుంటే మునిగిపోతారని జోస్యం చెప్పారు. చిడతలు కొట్టడం మానేసి, సభ కొనసాగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

AP Elections 2024 టీడీపీ -జనసేన కలిస్తే 160 సీట్లు BJP - TDP కలుస్తాయా ? | Oneindia Telugu
అంతకుముందు-

అంతకుముందు-


టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప.. తదితరులు సభలో చిడతలు వాయించారు. మంగళవారం గద్దె రామ్మోహన్ రావు విజిల్స్ వేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా టీడీపీ సభ్యులు ఇవ్వాళ సభలో చిడతలు వాయిస్తూ కనిపించారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న విజిల్స్ వేశారు..ఇవ్వాళ చిడతలు వాయించటం ద్వారా సభ గౌరవాన్ని కించ పరుస్తున్నారంటూ మండిపడ్డారు.

English summary
Minister Kodali Nani slams TDP Chief and Opposition leader Chandrababu during assembly sessions in cheap liquor deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X