వైసీపీ నాయకులకు లాభం, మద్యం ప్రియులకు శాపం, లెక్క మారుస్తాం, మంత్రి కొల్లు
గత వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి నాసిరకం మద్యం విక్రయించిందని, ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యం విక్రయాలు జరగడంతో అప్పటి నుంచి గంజాయి వినియోగం ఎక్కువ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ నాయకుల సొంత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వంలో పనికిరాని మద్యం పాలసీ తీసుకువచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
బుధవారం విజయవాడలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని, ఆ పార్టీ నాయకులు వారి సొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ఆధాయానికి నష్టం వచ్చేలా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానం వలన ఆ పార్టీ నాయకులు లాభపడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

గత వైసీపీ ప్రభుత్వం మధ్యం విధానం వలన పేద ప్రజలు, సామాన్యుల ఆరోగ్యం నాశనం అయ్యిందని, అయినా కూడా పనికిమాలిన కొత్తకొత్త బ్రాండ్ల మద్యం తీసుకు వచ్చి అనేక కుటుంబాలను నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగిందని, ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అద్యయనం చేసి త్వరలో తక్కువ ధరకు ప్రజలకు నాణ్యమైన మద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తీసుకు వస్తామని, గత వైసీపీ ప్రభుత్వంలో పెరిగిపోయిన గంజాయి విక్రయాలను ఉక్కుపాదంతో తొక్కేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.












Click it and Unblock the Notifications