Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : తమ్ముడు వైజాగ్ గుడ్ లక్: మంత్రి కేటీఆర్ ట్వీట్

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై.. తమ్ముడు వైజాగ్ అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ హంగామా అప్పుడే మొదలయ్యింది. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలతో విశాఖ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. మార్చి మూడు, నాలుగవ తేదీలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి భారీ పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక బద్దంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్: హైదరాబాద్ ను కొనియాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్

గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్: హైదరాబాద్ ను కొనియాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్

ఇక విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ పై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మార్చి 3, 4 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు ముందు హైదరాబాద్లో జరిగిన నాలుగవ ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 ప్రధాన రంగాలలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను హైలెట్ చేసింది .ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ మరియు విశాఖపట్నం మధ్య పోలికను చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ అభివృద్ధిని కొనియాడారు.

పెద్దన్న హైదరాబాద్ అన్న ఏపీ మంత్రి.. తమ్ముడు వైజాగ్ అంటూ కేటీఆర్ ట్వీట్


పెద్దన్న హైదరాబాద్ అభివృద్ధి చూసి గర్వపడుతున్నామని, ఏపీలో కూడా అటువంటి అభివృద్ధిని త్వరలో చూస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తున్న మా తమ్ముడు వైజాగ్ కు , సోదరి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ పెద్దన్న హైదరాబాద్ అంటూ గుడివాడ అమర్నాథ్ పేర్కొన్న అంశాలతో వచ్చిన ఒక వార్త క్లిప్పింగ్ ను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి: మంత్రి కేటీఆర్

రెండు తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి: మంత్రి కేటీఆర్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న వారికి తన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, భారతదేశంలో అత్యుత్తమంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్ట్ కు థాంక్ యూ కేటీఆర్ గారూ అంటూ వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి స్పందించింది.

రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లక్ష్యం ఇదే

రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లక్ష్యం ఇదే

రెండు రోజులు పాటు విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 24 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. 14 రంగాలలో పెట్టుబడులకు సంబంధించి అనేక ఎం ఓ యు లు జరుగుతాయని ఇప్పటికే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న వనరులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ సమ్మిట్ ద్వారా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+