ఆర్మీపై ప్రశంసలు కురిపించిన నారా లోకేష్, గండ్లు పూడ్చివేత పనులు
భారీ వర్షాలు, వరదల ముంచెత్తిన విజయవాడ నగరాన్ని సాదారణ స్థితి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. విజయవాడను ముంచెత్తడానికి కారణమైన బుడమేరు గండి పూడ్చివేత పనులు దాదాపు 95 శాతం పూర్తి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. శనివారం బుడమేరు మూడో గండి పూడ్చవేత పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.
బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలిస్తున్న అధికారుల నుండి మంత్రి నారా లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి చేసి ఇక ముందు ఇలాంటి సమస్య ఎదురు కాకుండా చూస్తామని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. సైన్యం సహాయంతో బుడమేరు గండి పూడ్చివేత పనులు జరిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సంఘటనా స్థలంలోనే ఉంటూ బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

గండి పడిన ప్రాంతంలోని దిగువకు వెళ్తున్న ప్రవాహ పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు ఇదే సందర్బంలో మంత్రి నారా లోకేష్ వివరించారు. బుడమేరు గండ్లను పూడ్చి వేయడానికి ఆర్మీ పూర్తి సహాయక సహకారాలు అందించిందని, సంబంధిత అధికారులు కష్టపడి పని చేస్తున్నారని, మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర వస్తులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, నిత్యవసర వస్తువుల కిట్లు అందించడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ వివరించారు.

బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొందరుమంత్రులు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు పర్యటిస్తూ సహాయక చర్యల్లో బాదితులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications