వంగవీటి ఇంటికి మంత్రి నారా లోకేష్, అభిమానులు ఖుషీ

తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధాను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐటి శాఖ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం విజయవాడ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడకు వచ్చిన అనంతరం తాడేపల్లిలోని పాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు.

అనంతరం మంత్రి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇప్పుడిప్పుడే వంగవీటి రాధా కోలుకుంటున్నారు.

Minister Nara Lokesh visited former Vijayawada MLA Vangaveeti Radha

విజయవాడకు చెందిన అనేకమంది నాయకులు పార్టీలకు అతీతంగా వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని అనేక మంది నాయకులు కోరుకున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో పర్యటించి కూటమి పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తిరిగిన వంగవీటి రాధాకృష్ణ కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని, వైసీపీని ఓడించాలని ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే ఇటీవల వంగవీటి రాధా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. త్వరలోనే వంగవీటి రాధాకృష్ణకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించడంతో వంగవీటి రాధా అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+