వారిని రెచ్చగొట్టొద్దు: చిరంజీవికి నారాయణ సలహా, ముద్రగడపై ఫైర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టవద్దని పురపాలక శాఖ మంత్రి నారాయణ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సలహా ఇచ్చారు. అమరావతి రోడ్ల నిర్మాణంలో 29 గ్రామాల్లో వేయి ఇళ్లు పోతున్నాయని, వారికి పరిహారం కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామని ఆయన చెప్పారు.
గ్రీన్ జోన్‌లో అన్ని అర్హతలున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేస్తానని అంటున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆయన విరుచుకుపడ్డారు.

ఏ పాయింట్ మీద దీక్ష చేస్తున్నారో ముద్రగడ పద్మనాభం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీవోల్లో ఏముందో చెప్పి ముద్రగడ దీక్షకు దిగాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కాపు నాయకులతో సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications