ఆంధ్రాను జగన్ సర్వనాశనం చేశాడు చంద్రబాబు మాత్రం, నిమ్మల

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఐదు సంవత్సరాల క్రితం జగన్ చెప్పిన మాయమాటలు నమ్మి ఆయన్ను సీఎం చేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పు చేశారని, ఆంధ్రప్రదేశ్ ను జగన్ సర్వనాశనం చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ సర్కార్ లో వైసీపీ చేసిన పాపాలు ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

జగన్ ప్రభుత్వంలో అన్ని చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై అప్పుల భారం పెరిగిపోయిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన 14 లక్షల కోట్ల రూపాయలు రుణభారం ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. జగన్ చేసిన అప్పులు వెంటాడుతున్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారని, పింఛన్లు పెంచారని, రైతులకు రూ 25వేల ఇన్పుట్ సబ్సిడీ పెంపు వంటి సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని, నిరుద్యోగులకు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Nimmala Ramanaidu accused Jagan of destroying Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు ఆ జిల్లాలోని తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ వారిని కలుస్తున్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం సాధించేలా అందరూ పని చెయ్యాలని మంత్రి నిమ్మల రామానాయుడు నాయకులకు సూచించారు.

సహకార సంఘాల ఎన్నికలు, సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలోని నాయకుల గెలుపు కోసం మూడు పార్టీల నాయకులు సమన్వయంగా పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నాయకులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు ఎత్తిచూపాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+