జపాన్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించిన పల్లె(పిక్చర్స్)
టోక్యో: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. మంత్రి పల్లెతో పాటు ఐటి అధికారులు బుధవారం జపాన్‌లో పర్యటించారు. జపాన్‌లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వా కూడా మంత్రితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టోక్యోలో ఏర్పాటుచేసిన ‘ది ఇండియా పెవిలియన్' పేరుతో ఏర్పాటు చేసిన ఐటి ఎగ్జిబిషన్‌ను పల్లె ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ, ఐటి రంగంలో జపాన్ బాగా అభివృద్ధి చెందిందని, ఏపి కూడా ఈ రంగంలో ముందడుగు వేస్తోందన్నారు.
ఐటి రంగంలో దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారికి అనేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు.
జపాన్‌కు చెందిన ఐటి దిగ్గజాలు ఏపిలో ఐటి సంస్థలు ఏర్పాటు చేసేందుకు వస్తే తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సత్యసాయిబాబా ఆలయాన్ని మంత్రి సందర్శించారు. గురువారం పల్లె వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

మంత్రి పల్లె
ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు.

మంత్రి పల్లె
మంత్రి పల్లెతో పాటు ఐటి అధికారులు బుధవారం జపాన్‌లో పర్యటించారు.

మంత్రి పల్లె
జపాన్‌లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వా కూడా మంత్రితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంత్రి పల్లె
టోక్యోలో ఏర్పాటుచేసిన ‘ది ఇండియా పెవిలియన్' పేరుతో ఏర్పాటు చేసిన ఐటి ఎగ్జిబిషన్‌ను పల్లె ప్రారంభించారు.

మంత్రి పల్లె
ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ, ఐటి రంగంలో జపాన్ బాగా అభివృద్ధి చెందిందని, ఏపి కూడా ఈ రంగంలో ముందడుగు వేస్తోందన్నారు.

మంత్రి పల్లె
ఐటి రంగంలో దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారికి అనేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు.

మంత్రి పల్లె
జపాన్‌కు చెందిన ఐటి దిగ్గజాలు ఏపిలో ఐటి సంస్థలు ఏర్పాటు చేసేందుకు వస్తే తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications