కుమార్తె పెళ్లిపత్రికతో...కనక దుర్గమ్మ సేవలో మంత్రి పరిటాల సునీత

అమరావతి: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబసమేతంతో ఆలయానికి వచ్చిన మంత్రి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మే 6న కుమార్తె వివాహం సందర్భంగా మంత్రి పరిటాల సునీత పెళ్లిపత్రికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్నికుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పరిటాల సునీత...ఈ సందర్భంగా కుటుంబంతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమారుడు శ్రీరామ్ దంపతులు, మరో కుమారుడు సిద్దార్ధ, కుమార్తె డా.స్నేహలత ఈ అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు.

Minister Paritala Sunitha Visits Durga Temple At Vijayawada

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కుమార్తె వివాహానికి ఆహ్వానించిచారు మంత్రి పరిటాల సునీత. ఉదయం 9 గంటల సమయంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కుటుంబంతో సహా ఆయనను కలసి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పరిటాల సునీత తన కుమార్తె డా.పరిటాల స్నేహలత వివాహ ఆహ్వాన పత్రికను సిఎం చంద్రబాబుకు అందించి వివాహానికి ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+