ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, చంద్రబాబు మాట అంటే మాటే, మంత్రి పయ్యావుల

ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వృద్దులకు ఇబ్బంది కలగకుండా చూడటానికి అధికారులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణి చెయ్యాలని, ఉరవకొండ నియోజక వర్గంలో మాకు పింఛన్లు రాలేదని ఎవ్వరు కూడా ఆరోపణలు చెయ్యకుండా అందరికి పింఛన్లు పంపిణి చెయ్యాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

ఉరవకొండ నియోజక వర్గం టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ పట్టణంతో సహ నియోజక వర్గంలోని గ్రామ గ్రామన టీడీపీ శ్రేణులు పింఛన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం పింఛన్లు పెంచామని, అర్హులు అయిన ప్రతిఒక్కరికి పింఛన్లు అందేలా టీడీపీ కార్యకర్తలు చూడాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.

Minister Payyavula Keshav said that they have gone door to door and distributed pensions as promised

సోమవారం నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ లభ్దిదారులకు పింఛన్లు అందేలా చూసిన టీడీపీ కార్యకర్తలు గతంలో పింఛన్లు తీసుకుంటున్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవ్వరికీ పింఛన్లు తొలగించలేదని, అర్హులు అయిన వృద్దులు అందరికీ పింఛన్లు అందిస్తున్నామని టీడీపీ నాయకులు అంటున్నారు.

అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వృద్దులకు సోమవారం పింఛన్లు పంపిణి చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజక వర్గాల్లో ఇంటింటికి వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పింఛన్లు పంపిణి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో పోలీసు బందోబస్తు నడుమ సోమవారం పింఛన్లు పంపిణి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+