కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి మకాం - వైసీపీ జెండా ఎగరాల్సిందే : బహిరంగ సభతో మొదలు...!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కేంద్రంగా అసలైన రాజకీయం నడుస్తోంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో భారీ స్కెచ్ సిద్దం చేస్తోంది. నామినేషన్ల పర్వం ముగియటంతో..ఇక, బరిలో ఉన్న వారిలో ఉప సంహరణ ప్రారంభం కానుంది. పార్టీ అధికారికంగా గుర్తించని వారిని..స్వతంత్రులుగా పోటీలో దిగిన వారికి బుజ్జగింపులు మొదలయ్యాయి. పెండింగ్ ఉన్న మున్సిపల్..స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి ప్రధానంగా రెండు ఎన్నికల పైనే అందరూ ఫోకస్ చేస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు
అందులో నెల్లూరు కార్పోరేషన్.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. గత వారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నియోజకవర్గ నేతలకు ఎలాగైనా కుప్పం మున్సిపాల్టీ గెలుచుకోవాలని నిర్దేశించారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించటంతో... ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరులో ఈ సారి ఓడిస్తానంటూ చంద్రబాబు సవాల్ చేసారు. ఇక, నామినేషన్ల పర్వం ముగియటంతో ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో బారీ బహిరంగ సభ నిర్వహించారు.

వైసీపీ సభకు స్పందనతో జోష్
సభకు పెద్ద ఎత్తున స్పందన రావటంతో వైసీపీ తమ విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎం అయిన తరువాత పేదల బతుకుల్లో ఆశలు చిగురించాయని, రెండున్నరేళ్ల పాలనలో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు.. కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో సభకు పుంగనూరు, పీలేరు, పలమనేరు నుంచి జనాన్ని తరలించుకున్నారన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి అక్కడే మకాం వేసి
చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్ సీపీ సభకు కుప్పం మున్సిపాలిటీ నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారంటే.. సీఎం వైయస్ జగన్‌పై కుప్పం ప్రజలకు ఉన్న ప్రేమ అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కుప్పం నియోజకవర్గం నుంచి 25 వేల మంది శాశ్వతంగా వలస వెళ్లారన్నారు. సుమారు మరో 20 వేల మంది రోజూ కూలీ పనులకు రైళ్లో బెంగళూరు, తమిళనాడు వెళ్తున్నారన్నారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
కుప్పంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నాడు వైఎస్సార్ ప్రాజెక్టు మంజూరు చేస్తే.. తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మకై సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు వేయించాడని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. గంగన్న శిరస్సు ప్రాజెక్టునూ ముందుకు జరగనివ్వలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. హంద్రీనీవా కాల్వను కుప్పం తీసుకురావడానికి చంద్రబాబుకు 5 సంవత్సరాలు పట్టిందా..? అని ప్రశ్నించారు. అనంతపురం చర్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు వదిలారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మున్సిపల్ ఎన్నికలలోపు కుప్పానికి నీరు రప్పిస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications