చంద్రబాబు కోటలో మంత్రి పెద్దిరెడ్డి మకాం: కుప్పంలో జోరుగా ప్రచారం: కుంభస్థలం టార్గెట్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికలపై అందరి దృష్టీ నిలిచింది. ఎంపీీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దూకుడును మున్సిపాలిటీ పోలింగ్‌లోనూ కొనసాగించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. ఆ పార్టీని నిలువరించడానికి, పట్టు నిలుపుకోవడానికీ తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం..
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీనడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా.. గట్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- ఈ స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.

మసకబారుతోన్న ఛరిష్మా..
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవు. పార్టీ ప్రతికూల పవనాలను ఎదుర్కొంటోంది. ఓటుబ్యాంకును తన వైపు తిప్పుకోగలిగింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు ఛరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి. దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ. టీడీపీ అధినేత పోటీ చేసినా సరే.. గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణ కుప్పంలో నెలకొంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది.

మళ్లీ పెద్దిరెడ్డి..
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనాల్సిన ప్రధాన అడ్డంకి వైసీపీ సీనియర్ నాయకుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలహీన పడటానికి ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలే కారణం. బద్వేలు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీకి 90 వేలకుపైగా మెజారిటీ రావడానికి పెద్దిరెడ్డి రూపొందించిన వ్యూహాలే మళ్లీ కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నిక బాధ్యతను ఆయన స్వీకరించారు.

కుప్పంలో పర్యటిస్తోన్న పెద్దిరెడ్డి..
ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పర్యటిస్తోన్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ఆయన ఇంటింటికీ ప్రచారం చేస్తోన్నారు. చంద్రబాబు వైఫల్యాన్నీ ఎండగడుతున్నార. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పని చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ విమర్శిస్తున్నారు. చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా చంద్రబాబు చేయలేదని ఆరోపిస్తోన్నారు.

బెంగళూరుకు వలస ఎందుకు..?
కుప్పం నుంచి రోజూ వందలాది మంది పొరుగునే ఉన్నబెంగళూరుకు వలస వెళ్లే పరిస్థితిని చంద్రబాబు నివారించలేకపోయారని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని, సొంత నియోజకవర్గం ఓటర్లు కూడా ఆయనను విశ్వసించట్లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. గుడిపల్లి మండలం బసినిగాని పల్లి వద్ద రెండు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని చెప్పారు. హంద్రీనీవా జలాలు ఇంకో వారం రోజుల్లోనే కుప్పానికి రానున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications