జగన్ లైఫ్ లో మారడు, జైల్లో స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడా ?, మంత్రి రెడ్డి

పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుందనే సమేత వైసీపీ నాయకులకి కరెక్ట్ గా సరిపోయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యంగంగా అన్నారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు జైల్లో ఉంటే ఎంతో బాధపడిపోతారో అంత బాధపడిపోయిన జగన్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి చాలా అర్జెంట్ గా జైలుకు వెళ్లారా ? అని వైసీపీ నాయకులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.

వరదలు వచ్చి విజయవాడ ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించి వారికి చేతనైన సహాయం చేయాల్సింది పోయి మాజీ సీఎం వైఎస్ జగన్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న వైసీపీ నాయకుడు నందిగం సురేష్ ని పరామర్శించడానికి వెళ్లారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరుపై విరుచుకుపడ్డారు.

Minister Ramprasad Reddy questioned what Jagan is doing in jail without caring about the people

విపత్తుల సమయంలో వరద బాధితులకి అందరూ వారికి చేతనైన సహాయం చేస్తుంటే అవేమి పట్టనట్లు మాజీ సీఎం జగన్ జైలుకు వెళ్లి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదని, ఆయన వ్యవహారం గురించి వైసీపీ నాయకులు ఏమైనా తెలిస్తే ప్రజలు కొంచెం వివరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యంగంగా అన్నారు.

ప్రకాశం బ్యారేజ్ ను పడవలతో ఢీ కొట్టి వాటిని కూల్చేయడానికి వైసీపీ నాయకులు కుట్రపన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు తీరు చూస్తుంటే అది నిజమే అని అర్థం అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గత పది రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని వరద బాధితులకు సహాయం చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని, ఈ వయసులో కూడా చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు

Minister Ramprasad Reddy questioned what Jagan is doing in jail without caring about the people

చంద్రబాబు కష్టాన్ని చూసిన ప్రభుత్వ అధికారులు సైతం ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత జరుగుతున్నా ఐదు సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారం అడ్డం పెట్టుకుని దోచుకున్న మాజీ సీఎం జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని కాలం గడిపేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించాలని ఆ పార్టీ నాయకులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఈ జన్మలో మారరని అర్థం అవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+