Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ ఫైల్స్ కు పోటీగా మదనపల్లె ఫైల్స్ సినిమా తీస్తే సూపర్ హిట్, మంత్రి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అరాచకాలపై ఓ పెద్ద సినిమాని తీయొచ్చని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గతంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీస్తే అది చాలా పెద్ద హిట్ అయ్యిందని, ఇప్పుడు మదనపల్లె ఫైల్స్ తో ఒక పెద్ద సినిమానే తీయొచ్చు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యంగంగా అన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో పలు ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. తరువాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి అలిపిరి బస్టాండ్, తిరుపతి బస్టాండ్ తదితర ప్రాంతాలను పరిశీలించి అక్కడి ఆర్ టీసీ బస్సు ప్రయాణికుతో మాట్లాడి వారి సమస్యల తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తిరుమల తిరుమల కు వెళ్లే భక్తుల కోసం కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని హామీ శ్రీవారి భక్తులకు హామీ ఇచ్చారు.

Minister Ramprasad Reddy said that Madanapalle Files movie can be made on the lines of Kashmir Files movie

గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కొంటామని హామీలు ఇచ్చినా ఒక్క బస్సు కూడా కొనుగోలు చెయ్యలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి నుండి తిరుమల వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరక్కుండా నివారించడానికి అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి శ్రీవారి భక్తులకు హామీ ఇచ్చారు. ఇకముందు ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణానికి ప్రత్యేక బస్సులు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆ దిశగా అధికారులు తుదిరూపురేఖలు తయారు చేస్తున్నారని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఆర్ టీసీ బస్ స్టాండ్, అలిపిరి బస్ స్టాండ్ పై ఇంకా ఎక్కువ శ్రద్ద చూపించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రధాన్యత ఇస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లెలో తాను పర్యటించిన సందర్భంగా ఆవులపల్లె ప్రాజెక్టు బాధితులు పెద్ద ఎత్తున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులపై ఫిర్యాదులు చేశారని, ఆయన మీద వచ్చిన ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆవులపల్లె ప్రాజెక్టు బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడటానికి సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+