సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం...!!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ కేసులో ఇప్పటికే నాగరాజును సస్పెండ్ చేసారు. కాగా, సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసారు. నాగరాజును విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ముగ్గురు సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది.

విజయవాడలో సాయికృష్ణ కేసు వ్యవహారంలో సీఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన తరువాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగింది. డీసీపీ లలిత కుమారి ఇప్పటికే సీఐ నాగరాజును విచారణ చేసారు. ఇదే సమయంలో నాగరాజు ఇంటికి లాయర్లు చేరుకున్నారు. మరో వైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదివారం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణ లంక పోలీస్టేషన్‌లో స్టేషన్ సిబ్బందితోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కృష్ణ లంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి పటమట సీఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు.

 సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
police-officials-chances-to-arrest-ci-nagaraju-in-sai-krishna-missing-and-alleged-custodial-death-ca

సిట్ ఏర్పాటు.. విచారణ ముమ్మరం

కాగా, మే 23 నుంచి 25వ తేదీ వరకు అనాథ మృతదేహాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అదే సమయంలో బస్టాండు నుంచి స్వర్గపురి వరకు ఉన్న సీసీ టీవీ కెమెరాలను కూడా గుణదల సీఐ పరిశీలించారు. ఇంకో వైపు ఇదే కేసులో క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విచారణ ఆధారంగా ఏసీపీ దైవ ప్రసాద్ బృందం సాక్ష్యాలను సేకరిస్తోంది. అలాగే సీఐ నాగరాజుతో ‌పాటు ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారిని మరోసారి విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కమిషనరేట్ పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం, గుణదల, వన్ టౌన్, సత్యనారాయణ పురం, పటమట సీ.ఐలతో కీలక ఆధారాల కోసం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+