NEET UG 2026 Re Exam అభ్యర్దుల కోసం మోదీ 45 నిమిషాల నిరీక్షణ..!!
దేశ వ్యాప్తంగా ఈ రోజు రీ నీట్- పరీక్ష కొనసాగుతోంది. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు.. విమర్శలతో ఈ సారి ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్ష నిర్వహిస్తోంది. కాగా, ఈ రోజు నీట్ పరీక్ష అభ్యర్దుల కోసం ప్రధాని మోదీ 45 నిమిషాలు నిరీక్షించారు. తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీట్ యూజీ 2026 రీ పరీక్ష వేళ ప్రధాని మోదీ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. నేడు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తోంది. బెంగాల్ పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి బయలుదేరాల్సి ఉండగా.. ఆ ప్రయాణాన్ని 45 నిమిషాల పాటు వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు మోదీ. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ. ప్రణాళిక ప్రకారం అటు నుంచి వెంటనే తన నివాసానికి బయల్దేరాల్సి ఉంది. కానీ నీట్ పరీక్ష మొదలయ్యే వరకు అక్కడే ఉండి, పరీక్ష ప్రారంభమైన తర్వాతే పయనమయ్యారు.

నీట్ అభ్యర్దులకు ట్రాఫిక్ సమస్య లేకుండా
కాగా.. రీ-నీట్‌ను దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఈ పరీక్ష సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు దాదాపు 2 లక్షలకు పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు. ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతున్న రీ-నీట్ సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. పలువురు అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా ఇదివరకే నిర్వహించిన నీట్ రద్దైన నేపథ్యంలో.. ఈసారి సరైన సమగ్రత, పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యంతో నిర్వహిస్తున్నట్టు ఎన్‌టీఏ పేర్కొంది. అయితే.. నీట్ పరీక్ష రాసే విద్యార్ధుల కోసం ప్రధాని మోదీ 45 నిమిషాలు వినామాశ్రయంలోనే వేచి ఉండటం ఇప్పుడు వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications