చంచల్‌గూడ జైలులో "ప్రభాస్".. ఎందుకంటే ???
రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకోగా.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.

కాగా తన ఫిల్మ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల నీడలు కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Spirit హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో షూట్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications