సీన్ రిపీట్, రోజాను దూరం పెట్టిన పెద్దిరెడ్డి, డీసీపీ, ఎంపీలు వెళ్లినా మేడమ్ మాత్రం, హుష్ కాకి !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆర్ కే రోజా పరిస్థితి అయోమయంగా తయారైయ్యింది. సొంతపార్టీ నాయకులతోనే రోజాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయి.

నగిరిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా మంత్రి అయ్యారు. రెండుసార్లు చాలా తక్కువ ఓట్లతోనే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు నగిరిలోని ఐదు మండలాల్లోని ముఖ్యమైన వైసీపీ నాయకులు రోజా తీరుతో విసిగిపోయి ఆమె తరపున ఎన్నికల ప్రచారం చెయ్యకుండా సైలెంట్ అయిపోయారు. అయితే మొండిపట్టుతో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్న మంత్రి రోజా నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ఆమె వెంట ఉండే కొంత మంది నాయకులతోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Minister RK Roja has once again distanced himself from Minister Peddireddy s faction
రోజా ఓడిపోతుందని అన్ని సర్వేలు, నగిరి ప్రజలు బహిరంగంగా చెప్పడంతో సీఎం వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. నగిరిలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి జగన్ సిద్దం అయ్యారు. అయితే మొదటి నుంచి రోజాను దూరం పెట్టిన వైసీపీ పెద్దాయన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎక్కడ ఉన్నా ఆ పరిసర ప్రాంతాల్లో రోజా కనపడటం లేదు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలంటి సీన్ మరోసారి వెలుగు చూసింది.

కార్వేటినరగం సమీపంలోని పెనమలూరు మండలం వైసీపీ గౌరవాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడు, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి సోదరుడు పాలసముంద్రం నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు నరసింహా రెడ్డి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కుమారుడు భూపేష్, చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, చాలా మంది వైసీపీ నాయకులు పెనుమూరు చేరుకుని నరసింహా రెడ్డి, జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను ఓదర్చారు. దాదాపు చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ అక్కడికి వెళ్లారు.

Minister RK Roja has once again distanced himself from Minister Peddireddy s faction
అయితే సమీపంలోని నగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆర్ కే రోజా మాత్రం అక్కడ కనిపించలేదు. మంత్రి, వైసీపీ పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పతో పాటు వైసీపీ నాయకులు చాలా మంది నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్లినా రోజా మాత్రం అక్కడికి వెళ్లకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది మొదటి నుంచి పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో అంటిముట్టనట్లు ఉండే రోజా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో విభేదించడంతో వారి వెంట రోజా వెళ్లలేదని తెలిసింది.

పాత సమస్యలు, గొడవలు మరిచిపోయి పెద్దిరెడ్డితో మంచితనంతో ఉండివుంటే ఈ రోజు నగిరిలో రోజా కళ్లు మూసుకుని గెలిచేది అని ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కూడా బెట్టు చేస్తే రోజాకు మొదటికే మోసం వస్తోందని, ప్రతి ఓటు విలువైనదిని అని రోజా ఇప్పటికైనా తెలుసుకుంటే ఆమెకే మంచిదని నగిరి వైసీపీ నాయకులు అంటున్నారు. ఇవేవి పట్టనట్లు రోజా నగిరిలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+