వైసీపీ ఎమ్మెల్యేపై మంత్రి సోమిరెడ్డి రూ. 5 కోట్ల పరువునష్టం దావా
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరువునష్టం దావా వేశారు. విదేశాల్లో సోమిరెడ్డి ఆస్తులను కూడబెట్టారంటూ గతంలో కాకాని డాక్యుమెంట్లు విడుదల చేశారు.
పోలీసు విచారణలో కాకాని విడుదల చేసిన డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. దీంతో, తన పరువుకు భంగం కలిగిందంటూ సోమిరెడ్డి.. కాకాని గోవర్ధన్‌పై జిల్లా కోర్టులో రూ. 5 కోట్లకు పరువునష్టం దావా వేశారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, తన ఆస్తులపై నకిలీ దస్తావేజులు సృష్టించి, తన పరువుకు భంగం కలిగించారని మండిపడ్డారు. సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ లలో తనకు ఆస్తులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications