పెన్ను ఉంది కదా అని!: కంచ ఐలయ్యపై సోమిరెడ్డి ఫైర్..
సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రచనలతో కులాలను గాయపరిచే రీతిలో వ్యవహరించడం సరికాదని
విజయవాడ: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగర్లు కోమటోళ్లు' పుస్తకంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రచనలతో కులాలను గాయపరిచే రీతిలో వ్యవహరించడం సరికాదని అన్నారు. రయితలకు చెడ్డ పేరు తెచ్చేవిధంగా ఐలయ్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కులం మొత్తాన్ని ఒకే గాటన కట్టం సరైంది కాదన్నారు. అన్ని కులాల్లోను మహానుభావులు ఉన్నారని, అదే సమయంలో చెడ్డవాళలు కూడా ఉన్నారని చెప్పారు. వైశ్యుల్లో పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి, తెలుగు రాష్ట్రం ఏర్పాటవడం కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.

మహాత్మాగాంధీ నుంచి పొట్టి శ్రీరాములు దాకా ఎంతో మంది దేశం కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. వైశ్యుల్లో వ్యాపారస్తులు ఉన్నారని, వ్యాపారం చేసుకోవడాన్ని తప్పుపట్టలేమని అన్నారు. వైశ్యులు సౌమ్యులని, ఒకరి జోలికి వచ్చే వ్యక్తులు కాదని, వాళ్లలోను తప్పులు చేసేవారుంటారని సోమిరెడ్డి చెప్పారు.
తన చేతిలో పెన్ను ఉంది కదా అని ఐలయ్య ఏదైనా మాట్లాడవచ్చునని భావిస్తున్నారని, ఆయన కోసం ప్రత్యేక చట్టాలేమి లేవని చెప్పుకొచ్చారు. రచయితలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు.












Click it and Unblock the Notifications