వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు; వారడిగితే పడవప్రమాదంపై విచారణ: మంత్రి తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగువ నుండి వస్తున్న వరద ప్రభావంతో కోనసీమ ప్రాంతంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. జలదిగ్బంధంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ క్రమంలో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా నిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు పడవ బోల్తా కొట్టడంతో టిడిపి నేతలు గోదావరి నది నీళ్లల్లో పడిపోయారు. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీపంలోనే జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అప్పటికే చంద్రబాబు మరొక బోటులోకి మారడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పదవ ప్రమాద ఘటనపై టీడీపీ నేతల అనుమానం.. స్పందించిన హోం మంత్రి
ఇక ఈ ఘటన పై టిడిపి నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబు జారి పడడమే తరువాయి అంటూ చేసిన ట్వీట్ ను టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలు చంద్రబాబు పర్యటనకు కనీస భద్రత కల్పించలేదని మండిపడుతున్నారు. ఈ ప్రమాదం వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. పడవ ప్రమాద ఘటనను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని ఆమె సీరియస్ అయ్యారు.

ఘటనపై టీడీపీ నేతలు అడిగితే విచారణ జరుపుతాం : మంత్రి తానేటి వనిత
పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో గోదావరి నదిలో 25 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న సమయంలోనే ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చంద్రబాబు పడవ బోల్తా ఘటన జరిగిందంటూ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పడవలపై వెళ్లారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదు
పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని పేర్కొన్న ఆమె గోదావరిలో మునిగి పోయిన టిడిపి నేతలను కాపాడింది మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటూ పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు వరదల పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. తాము వరద సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేశామని, వరద బాధితులను ఆదుకోవడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నం చేశారని తానేటి వనిత తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంపై కావాలని టీడీపీ దుష్ప్రచారం
వరదల సహాయక చర్యల కోసం సీఎం 41 కోట్ల రూపాయలను విడుదల చేశారని, వరద బాధితుల్లో ఇప్పటివరకు 95 వేల మందికి ఆర్థిక సహాయం అందజేశామని మంత్రి తానేటి వనిత వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను వారి పార్టీ నాయకులే విమర్శిస్తున్నారని, తాము విమర్శించాల్సిన పనిలేదని తానేటి వనిత పేర్కొన్నారు. టిడిపి అంతర్గత తప్పిదాలను కప్పిపుచ్చడం కోసం కావాలని వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications