నేను బ్యాడ్మింటన్ ఆడుతా: గోపీచంద్ తెలుగువాడు కావడం గర్వంగా ఉందన్న వెంకయ్య
అమరావతి: విజయవాడ క్లబ్ ఆధ్వర్యంలో రియో ఒలింపిక్స్ రజక పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వారిరువురికా అభినందనలు తెలిపారు.
క్రీడల ప్రావిన్యానికి మూల కేంద్రం గోపీచంద్ అని, ఆయన తెలుగువాడు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. అకాడమీ పెట్టి, కష్టనష్టాలకు ఓర్చి, ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్నారని అన్నారు. భారత జాతి గర్వించదగ్గ సింధుని తయారు చేశారని వెంకయ్య కొనియాడారు.

చిన్న వయసులోనే కఠోరమైన దీక్ష, పట్టుదలతో భారత్ దేశానికి రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిందని వెంకయ్య అభినందించారు. శారీరక శ్రమ లేకపోతే మనస్సులో ఉత్సాహం ఉండదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శారీరక శ్రమతోనే మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఆయన చెప్పారు.

క్రీడల ద్వారా శారీరక శ్రమ కలుగుతుందని చెప్పిన ఆయన ఈ వయసులోనూ తాను ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే తాను చేస్తోన్న శ్రమే కారణమని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఉదయం తాను కూడా బ్యాడ్మింటన్ ఆడుతానని వెంకయ్య తెలిపారు. దేశంలో క్రీడలని మరింత ప్రోత్సాహించాల్సి ఉందని అన్నారు.
Happy & proud to welcome and felicitate @Pvsindhu1's and Pullela #Gopichand at function organised by Vijaywada club. pic.twitter.com/z11Lz6SXmY
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016
Participated in a function organised to felicitate @Pvsindhu1 & #Gopichand by VijayawadaClub.. pic.twitter.com/hj0QesL5nV
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications