చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి విడదల రజిని
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు వైద్య రంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు విడదల రజిని. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మీడియాతో మాట్లాడిన విడదల రజిని క్షేత్ర స్థాయిలో సేవలు ఎలా ఉన్నాయో చూడడానికి తాను వచ్చానని పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ రూపురేఖలు మార్చామని పేర్కొన్నారు మంత్రి విడదల రజిని .టిడిపి హయాంలో వైద్య రంగాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని చంద్రబాబును మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు.

ప్రజల సంక్షేమం పట్టని చంద్రబాబు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి విడదల రజిని అసహనం వ్యక్తం చేశారు.వైద్యం కోసం ఆసుపత్రులకు వస్తున్న వారికి ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని విడదల రజిని పేర్కొన్నారు.వైద్య రంగానికి ఎంతో మంచి చేస్తుంటే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా ఏపీని నిలిపామని మంత్రి విడదల రజని పేర్కొన్నారు . ప్రభుత్వ వైద్య రంగం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంటే చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతున్నారని విడదల రజిని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక డాక్టర్ ని కూడా నియమించలేదని, వైద్య రంగాన్ని నీరుగార్చారని మంత్రి విడదల రజిని ఆరోపించారు. వైద్య రంగం పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. ఇకనైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని మంత్రి విడదల రజిని హితవు పలికారు.












Click it and Unblock the Notifications