గెలుపు పై రజనీ ధీమా వెనుక - జగన్ ఏం చెప్పారు..!!

ఏపీలో కొన్నినియోజకవర్గాల్లో పోటీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి మంత్రి రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్దుల మార్పులో తొలి జాబితాలోనే గుంటూరు పశ్చిమ నుంచి రజనీ పేరు ఖరారు చేసారు. అప్పటి నుంచి రజనీ ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు పైన ధీమాగా ఉన్నారు. తాజాగా జగన్ సైతం రజనీకి కీలక దిశా నిర్దేశం చేసారు.

నియోజకవర్గంలో ప్రచారం
మంత్రి రజనీని సీఎం జగన్ ఏరి కోరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి గెలవనిఈ నియోజవకర్గంలో ఈ సారి గెలిచి తీరాలని నిర్దేశించారు. ఖచ్చితంగా గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని రజనీ చెప్పుకొచ్చారు. బీసీ వర్గానికి చెందిన రజనీకి జగన్ ఇక్కడ సీటు కేటాయించటంతో..టీడీపీ తప్పని పరిస్థితుల్లో మహిళా అభ్యర్దిని బరిలోకి దించింది. అయితే, అప్పటికే రజనీ నియోజకవర్గంలో తన మార్క్ ప్రచారంతో అందరికీ దగ్గరయ్యారు. అన్ని వర్గాలకు చెందిన వారికి దగ్గరయ్యారు. టీడీపీ ఓట్ బ్యాంక్ గా భావించే వారిని తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ రాజకీయం పైన అవగాహన ఉండటంతొ పాటుగా ఎన్నికలు చేసిన అనుభవం రజనీకి కలిసొచ్చే అంశంగా మారింది.

Minister Vidadala Rajini has been an unstoppable force in guntur west confident on victory

రజనీ వ్యూహాత్మకంగా
నియోజకవర్గంలో గెలుపులో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయిజ దీంతో, ఒక వైపు ప్రచారం కొనసాగిస్తూనే..మరో వైపు అన్ని వర్గాల ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో గతంలో ఎవరూ పట్టించుకోని వర్గాలకు జరిగిన మేలు గురించి వివరిస్తూ..భవిష్యత్ లో వారికి దక్కే ప్రాధాన్యత గురించి హామీ ఇస్తున్నారు. జగన్ హాయంలో విద్య, ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యత..సంక్షేమం గురించి రజనీ ప్రత్యేకంగా ప్రతీ ఓటరుకు వివరిస్తున్నారు. గుంటూరు వెస్ట్ లో వైసీపీకి 49% శాతం అనుకూలంగా ఉండగా.. టీడీపీకి 43%, ఇతరులు 8% ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ తాజా మేనిఫెస్టో ద్వారా అనూహ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పెరిగినట్లు తాజా సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Minister Vidadala Rajini has been an unstoppable force in guntur west confident on victory

రజనీ ధీమా వెనుక
గుంటూరు వెస్ట్ లో ఇంతవరకు ఏ పార్టీకి హ్యాట్రిక్ విజయాలు రాలేదు. సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఈసారి విడదల రజినీకి కలిసొస్తోంది. 2014,2019 లో గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ గెలిచింది. ఈ సారి మాత్రం వైసీపీ గెలుపు ఖాయమనే ప్రచారం క్షేత్ర స్థాయిలో జరుగుతోంది. జగన్ తన బస్సు యాత్ర సిద్దం సభలో రజనీ గురించి పరిచయం చేస్తూ హీరోగా అభివర్ణించారు. ఈ రోజు పొన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభ సమయంలోనూ జగన్ తో రజనీ సమావేశమయ్యారు. ఆ సమయంలో నియోజకవర్గంలో ప్రచారం గురించి వివరించారు. గుంటూరు పశ్చిమం పైన సానుకూల నివేదికలు వస్తున్నాయని.. ఎక్కడా అతి విశ్వాసం లేకుండా.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని రజనీకి సూచించారు. దీంతో..రజనీ తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+