వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రి అభిమానుల అత్సుత్సహాం : కరెన్సీ నోట్లతో - బైక్ విన్యాసాలతో : బాధ్యతలు చేపట్టిన రెండో రోజే..!!

|
Google Oneindia TeluguNews

మంత్రిగా బాధ్యతలు చేపట్టి..సొంత జిల్లాకు వచ్చిన తమ నేతకు స్వాగతం పలికే విషయంలో అభిమానులు పోటీ పడ్డారు. ఆ అభిమానం హద్దులు దాటింది. విమర్శలకు కారణమైంది. సీనియర్ నేత విశ్వరూప్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన సొంత జిల్లాకు వచ్చారు. 2019లో అమలాపురం నుంచి గెలిచిన విశ్వరూప్ జగన్ తొలి కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో తిరిగి అవకాశం పొందిన 11 మంది సీనియర్లలో ఒకరు. ఆయనకు ఈ సారి రవాణా శాఖ కేటాయించారు.

మంత్రికి స్వాగతం పలికే వేళ..

మంత్రికి స్వాగతం పలికే వేళ..

విశ్వరూప్ గతంలో వైఎస్సార్ కేబినెట్ లోనూ మంత్రిగా వ్యవహరించారు. వివాదాలకు దూరంగా ఉండే విశ్వరూప్..ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే వార్తల్లో నిలిచారు. మంత్రి సొంత నియోజవకర్గానికి రాక సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ద్విచక్రవాహనాలతో హడావిడి చేశారు. ఓ యువకుడు మోటారు సైకిల్‌పై వినాస్యాలు చేశాడు. దానిని చూసి ఆనందాన్ని తట్టుకోలేక నగరం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు తన వద్దనున్న కరెన్సీ వెదజల్లారు.

కరెన్సీ వెదజల్లుతూ.. వీడియో వైరల్

కరెన్సీ వెదజల్లుతూ.. వీడియో వైరల్

మామిడికుదురు మండల వైసీపీ నాయకుడిగా ఉన్న కొండల రావు కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్లమీద చల్లుతూ స్వాగతం పలకడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. గాల్లోకి కరెన్సీ నోట్లను వేయటం..ఎగిరిన నోట్లను చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనైన యువకులు వెంటనే తేరుకున్నారు. వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అభిమానుల అత్యుత్సాహం ..మంత్రికి ఇబ్బందిగా

అభిమానుల అత్యుత్సాహం ..మంత్రికి ఇబ్బందిగా

తూర్పు గోదావరి నుంచి విశ్వరూప్.. వేణు మంత్రులుగా కొనసాగుతుండగా.. దాడిశెట్టి రాజా కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కోనసీమ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్.. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయన అభిమానుల తీరు పార్టీలోనూ..కామన్ పబ్లిక్ లోనూ చర్చకు కారణంగా మారుతోంది.

అభిమానం హద్దులు దాటటం ఇప్పుడు మంత్రిగా సమస్యగా మారుతోంది. దీని పైన మంత్రి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఆర్టీసీ ఛార్జీలను డీజిల్ సెస్ రూపంలో పెంచటం పైన ప్రతిపక్షాలు నిరసలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో రవాణా శాఖ మంత్రిగా విశ్వరూప్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటువంటి ఘటనలు మరింత సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
Vishwaroop fans showed great enthusiasm and throwing currency while welcoming him became a hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X