హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూడా కూల్చేస్తాం, రుషికొండ కథ త్వరలో తేలుస్తాం, మంత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరోసారి వైసీపీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహాలోనే ఇక్కడా అలాంటి అక్రమ కట్టడాలు కూల్చేస్తామని, అందులో ఎలాంటి మొహమాటం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన అక్రమ కట్టడాల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని మంత్రి నారాయణ అన్నారు.
ఆ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అంతిమ నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ చెప్పారు. విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విరుచుకుపడ్డారు. రిషికొండలో నిర్మించిన అక్రమ కట్టడాలపై చంద్రబాబు నాయుడు పూర్తిగా దృష్టి సారించారని, కూటమి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ అన్నారు.

కూటమి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినా, అక్రమాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకోరని, ఆ విషయం అందరికీ తెలుసు అని మంత్రి నారాయణ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన అక్రమ కట్టడాల సమాచారం గురించి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నదని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతనే అక్రమ కట్టడాల విషయంపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలు కూల్చేస్తామని మంత్రి నారాయణ చెప్పడంతో ఇప్పటికే అలాంటి కట్టడాలు నిర్మించిన కొంతమంది నాయకులు హడలిపోతున్నారని తెలిసింది. హైదరాబాదులో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ కట్టడాలు ఇలాగే కూల్చేస్తామని మంత్రి నారాయణ బహిరంగంగా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications